డియర్ కామ్రేడ్స్,
తేదీ 16.09.2022 అనంతపురంలో కా// బి.కొండప్ప జిల్లా కార్యదర్శి నాయకత్వంలో కా// కళాందర్ (je) జిల్లా అద్యక్షులు వారి అద్యక్షతన ఉత్తేజ పూరిత ఎన్నికల సభ జరిగింది. అందులొ సర్కిల్ కార్యదర్శి కా// కె అంజయ్య, సర్కిల్ సహాయ కార్యదర్శి కా//కె వి యతీంద్రనాధ్ మరియు సేవా BSNL జిల్లా కార్యదర్శి కా// గోపాల్, (DE )Sewa అధ్యక్షులు బ్రదర్ తిప్పన్న మరియు కడప జిల్లా కార్యదర్శి కా// టి.గంగాధర్ రెడ్డి తదితరులు హాజరై NFTE S.No.13 కు ఓటు వేసి గెలిపించాల్సిన అవసరతను గురించి ప్రసంగించారు. 42 మందికి పైగా క్రియాశీలక సభ్యులు హాజరైనారు ఈ సమావేశం లొ సర్కిల్ కార్యదర్శి అంజయ్య గారు మాట్లాడుతూ చిత్తశుద్ది తో సేవా సభ్యులు వారి అసోషియేషన్ ను ఆలిండియా, సర్కిల్ పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ కించపరిచే విధంగా చేస్తున్న చర్యలను గమనంలోనికి తీసుకొని క్రియాశీలకంగా NFTE BSNL కు S.No 13 కు ఓటు వేసి ఎంప్లాయిస్ యూనియన్ కు తగిన బుద్ది చేయాలని విజ్ఞప్తి చేసారు. అదే విధంగా యువకులైన జె ఇ కేడరు సభ్యులు చైతన్య వంతగా ఈ ఎన్నికలలొ కృషి చేసి NFTE జెండా ను అనంతపూర్ లొ ఎగరవేయాలని చెప్పారు. ఈ సమావేశం లొ ఇద్దరు మహిళా సభ్యులు, 13 మంది డైరెక్ట్ జె ఇ సభ్యులు తో పాటుగా 42 మంది సభ్యులు పాల్గొనటం జరిగింది ACS యతీంద్రనాధ్ NFTE కృషి వల్లనే మన సర్కిల్ నందు JTO posts 19 కు పెరిగాయని, మన యూనియన్ సభ్యులు చిత్తూరులొ 2 +1 sewa సభ్యుడు, కడప జిళ్లా కార్యదర్శి మరియు అనంతపురం నుండి 1 సభ్యుడు, కర్నూల్, ఒంగోలు నుండి ఒక్కొక్కరు చొప్పున JTO గా ప్రమోషన్ పొందినారని, అందుకు సర్కిల్ యూనియన్ కు గర్వంగా ఉందని తెలియ చేసి, జె టి ఓ గా ప్రమొషన్ పొందిన ఇద్దరు సభ్యులను శాలువాతో సత్కరించటం జరిగింది. SEWA DS బ్రదర్ గోపాల్ గారు సమావేశం లొ మాట్లాశుతూ ఆలిండియా, సర్కిల్ డైరెక్షన్ల ను అనంతపురం జిల్లాలో నిబద్దత తో అమలు చేసి NFTE గెలుపుకు శాయశక్తులా సహరిస్తామని తెలియ చేశారు.
సమావేశానికి ముందుగా GMTD ఆఫీసు లొని ఉద్యోగులందరిని సర్కిల్ కార్యదర్శి తో పాటుగా కలిసి NFTE S.No.13 కి ఓటు వేయాలని అభ్యర్థించటం జరిగింది. కా// బి.కొండప్ప వందన సమర్పణ తో సమా వేశం ముగిసింది.
జిందాబాద్ NFTE, NFTE గెలవాలి – BSNL నిలవాలి, అనే నినాదాన్ని సర్కిల్ యూనియన్ తీసుకున్న దాన్ని నిజం చెద్దామని సమావేశంలో నిర్ణయించటం జరిగింది
– సర్కిల్ కార్యదర్శి,
ఎన్ ఎఫ్ టీ ఈ, ఏ.పి