S.No 13 NFTE union ను మొదటి యూనియన్ గా ఎన్నుకుందాం – అన్యాయాన్ని , నిర్లక్ష్యాన్ని ఓడిద్దాం – NFTE -SEWA పిలుపు–
డియర్ కామ్రేడ్స్ ,
మొదటి గుర్తింపు యూనియన్ గా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ తన గుర్తింపు కాలం మొత్తం స్వలాభం చూసుకుంటూ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోర్ సమస్యల ఎడల నిర్లక్ష్య వైఖర్ని అవలంభించి అన్యాయానికి గురిచేసింది
2 వ వేతన సవరణ చర్చలలొ ఏ ఒక్క యూనియన్ ను చర్చలలొ భాగస్వామ్యం చేయకుండా , అవగాహన లేకుండా 10 సంవత్సరాల అగ్రిమెంటు తో. తొమ్మిది వేల మంది నాన్ ఎగ్జిక్యూటివ్ లను వేతన స్టాగ్నేషన్ కు గురి చేసి తీవ్ర అన్యాయానికి గురి చేయటమే కాకుండా , ఇప్పటి వరకు 3 వ వేతన సవరణ జరగకుండా ఉండటానికి కారణ భూతి గా మిగిలింది.
3 వ వేతన సవరణ సమయంలో జీరో శాతం ఫిట్మెంట్ ప్రతిపాదించి మరోసారి ఉద్యోగులకు అన్యాయాన్ని తలపెట్త టానికి ప్రత్నించగా , NFTE యూనియన్ గుర్తింపు యూనియన్ గా ఉన్నకారణం గా ఆ ప్రతిపాదనను అడ్డుకోవటం జరిగి 5 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదన పెట్టటం జరిగింది. NFTE గుర్తింపు యూనియన్ గా ఉన్నందునే ఆ అన్యాయాన్ని అడ్డుకొవటం జరిగిందని గుర్తించాలి.
అస్తవ్యస్తమైన వివక్షత తొ కూడిన మరియు sc/sT ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన రిజరేషన్లు లేని ప్రమోషన్ పాలసీ ద్యారా ఉద్యోగులను అన్యాయానికి గురిచేయటం జరిగింది
లోకల్ కౌన్సిల్స్ నుండి నేషనల్ కౌన్సిల్స్ వరకు మీటింగులు జరగటానికి ఉద్దేశ పూర్వకంగా సహకరించని కారణంగా , ఉద్యోగుల ముఖ్య సమస్యలైన *నూతన ప్రమోషన్ పాలసీ ఏర్పాటు , 30%SAB , కంపాసినేట్ ఉద్యోగాలపై బ్యాన్ ఎత్తివేత , జె ఇ లకు పరీక్షల నిర్వహరణకు తగిన ఖాళీలు ఏర్పాటు మరియు SC/ST బాక్ లాగ్ ఖాళీలు పూరించటం తదితరములు పరిష్కారానికి వీలు లేకుండా ఉద్యోగులకు ఎంప్లాయీస్ యూనియన్ అన్యాయం చేసింది. Sewa నాయకులు శ్రి పెరుమాళ్ గారిని నేషనల్ కౌన్సిల్ లొ సభ్యునిగా NFTE నామినేట్ చేస్తే దాన్ని వ్యతిరెకించి అసలు నేషనల్ కౌన్సిల్ నే జరగకుండా అడ్దు కొవటం జరిగింది.
*ఈ ఎన్నికల లొ చెప్పుకోవటానికి ఏమి లేని కారణంగా అబద్దాల ప్రచారాలతోను , AUAB ద్యారా సాధించుకున్న సమస్యలను తమ ఖాతా లొ వేసుకొని ఆ యూనియన్ కు ఓటు అడుగుతున్నారు. దీన్ని ఉద్యోగులందరు గుర్తించాలని కోరుతున్నాము*
నాన్ ఎ గ్జిక్యూటివ్ ఉద్యోగులందరికి జరిగిన అన్యాయాలను తొలగించటం కొరకు , పెండింగు సమస్యలను చిత్త శుద్ది తొ పరిష్కరించటం కొరకు ” SEWA BSNL బలపర్చుతున్న NFTE BSNL గుర్తు సీరియల్ నెంబరు 13 కు ఓటు వేసి మొదటి యూనియన్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం
పోలింగు తేది 12-10-2022
SEWA&NFTE : AP Circle vijayawada