ప్రియమైన కామ్రేడ్స్ ,
💐హార్ధిక అభినందనలు 💐
దేశవ్యాప్తంగా 9వ సభ్యత్వ వెరిఫికేషన్ యొక్క ఫలితాలు అక్టోబరు 14 వ తెదిన ( ఈ రోజు ) విడుదల అయినవి. గతం లొ మాదిరిగానే రెండు యూనియన్లు BSNLEU-NFTE గుర్తింపు హోదా ను మొదటి , రెండవ యూనియన్లు గా పొందటం జరిగింది. కౌన్సిల్ సీట్ల లొ కూడ ఎలాంటి మార్పు లెదు. వాస్తవం గా ఎంప్లాయీస్ యూనియన్ కు 50% సభ్యత్వాన్ని ఎన్నికల ముందు కలిగి ఉన్నది. కాని ఈ వెరిఫికేషన్ లొ సేవా బి యస్ యన్ యల్ NFTE కి అగ్రభాగాన నిలబడి మద్దతును ఇచ్చి ఆ యూనియన్ మెజారిటీని నిలువరించటం జరిగింది. మన సర్కిల్ లొ NFTE ని మెజారిటి యూనియన్ గా నిలబెట్టటం లొ SEWA BSNL పాత్ర వెలకట్టలేనిది గా చెప్పవచ్చును. Dr JE యువ కేడరు కామ్రేడ్స్ సహకారం కూడ అభినందనీయము. అదే విధంగా జిల్లా కార్యదర్శులు అందరు వారి, వారి శక్తి మేరకు అన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ ఎన్నికలలొ కష్టపడినారు. కొన్ని జిల్లా లొ ఆశించిన ఫలితాలు రానందున కొంత నిరాశ కల్గి ఉండవచ్చు. కాని సర్కిల్ గెలుపులొ వారి పాత్ర కూడ ఉందని గుర్తించాలి.
ఈ విజయం లొ అందరు పాత్ర దారులే! సర్కిల్ యూనియన్ తరఫున సేవా బి యస్ యన్ యల్ సర్కిల్ మరియు జిల్లా కార్యవర్గానికి మరియు యువ కామ్రెడ్స్ అందరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. 🙏🏻
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి
ఎన్ ఎఫ్ టీ ఈ -ఎ పి సర్కిల్
October 16, 2022