ఇస్లాంను అనుసరించే వారికి అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన బక్రీద్ లేదా ఈద్ అల్ అధాకు ఎంతో ప్రాధాన్యముంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు భక్తి, శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. రంజాన్ మాసం వచ్చిన దాదాపు రెండు నెలల తర్వాత ఈ పండుగ వస్తుంది. ఇది ముస్లీంల రెండో ముఖ్యమైన పండుగ.