వేతన సవరణ అంశంలో NFTE యూనియన్ కు BSNLEU కు మధ్య ఉన్న తేడాను గమనించండి
డియర్ కామ్రేడ్స్ ,
✅ NFTE 2002 లో గుర్తింపులొ ఉన్నపుడు కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా మొదటి వేతన సవరణ చర్చలలొ బెటరు అగ్రిమెంటు పొందటానికని ,సంస్థలొని అన్ని యూనియన్ల కు చర్చలలొ పాలుపంచుకోవటానికి అవకాశం కల్పించి , 1-1-2002 నుండి 5 సంవత్సరాల పిరియాడీషిటితొ , పెర్క్స్ తో సహా మంచి అగ్రిమెంటు తేవటం జరిగింది.
అందువల్లనే రెండవ వేతన సవరణ 5 సంవత్సరాల కాల పరిమితి తో 2007 లొ జరగటానికి మార్గం సుగమనమైంది.
➡️ 2004 to 2013 వరకు BSNLEU ఒక్కటె సోల్ గుర్తింపు యూనియన్ గా ఉండి , 35% ఉద్యోగుల మద్దతు ఉన్న NFTE తో సహా మిగతా యూనియన్ల ను అనుమతించకుండా , ఒక్కటే చర్చలలొ పాల్గొని 78.2% IDA విలీనానికి బదులుగా 68.8% IDA విలీనానికి అంగీకరించి ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని అంటే , 9.4% వేతనాన్ని మరియు 5 సం / బకాయిలను నస్ఠపరిచింది.
➡️ 5 సం ఒకమారు జరగాల్సిన వేతన సవరణ ను మేనేజ్మెంట్ తో లాలూచి పడి , 10 సం . కు అగ్రిమెంట్ అయ్యి ఉద్యోగులకు తీవ్ర అన్యాయాన్ని BSNLEU చేసింది.
➡️5 సం పిరియాడిసిటీ తొ వేతన సవరణ అయితే మనకు 2012 లోనే 3 వ వేతన సవరణ జరిగి ఉండేది. ఆ నాటికి BSNL ఆర్థిక స్థితి చాలా బాగున్నది.
➡️ ఇటీవల BSNLEU జనరల్ సెక్రటరి మేనేజ్ మెంట్ ముందు సాగిల పడి “0” % ఫిట్ మెంట్ తో అయినా వేతనసవరణ జరపాలని అర్ధించిన విశయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయినా ఏ మాత్రం తగ్గేదే లేదంటు వారి సమావేశాలలొ సైతం చెప్పిన విశయం వైరల్ అయిన విశయాన్ని ఉద్యోగులు మర్చి పోలేదు.
✅NFTE ఆ “౦”% ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన కారణంగా కా / అభిమన్యు ఆ ప్రతిపాదన నుండి వెనక్కి తగ్గి NFTE ప్రతిపాదించిన 5% ఫిట్మెంట్ కు అంగీకరించటం జరిగింది. దీన్ని బట్టి మేనేజ్మెంట్ ఏజెంట్ గా BSNLEU మాత్రమే ఉన్నదని తెలియచేస్తుంది.
➡️ పెర్క్స్ , అలవెన్స్ లు అన్ని కూడ NFTE గుర్తింపు నాటి వి మాత్రమె పొందటం జరుగుతుంది. ఈ 18 సం కాల గుర్తింపు సమయం లొ BSNLEU చేసిన పని ఏమైనా ఉందా అంటే ! అది మేనేజ్మెంట్అన్ని బెనిఫిట్ లను ఒక దాని తరువాత ఒకటిగా రద్దు చేస్తుంటె ప్రేక్షక పాత్ర పోషించింది.
✅NFTE బోనస్ అనేది ఉత్పత్తి తొ ముడిపడి చెల్లించాలని అగ్రిమెంట్ అయితే BSNLEU దాన్ని లాభాలతో ముడిపడె బోనస్ గా మార్చి అసలు బోనస్ అనే మాట లేకుండా చేసిన ఘనతను సాధించారు గదా !
కామ్రేడ్స్
కావున BSNL ఉద్యోగులు మొత్తం Dt 12-10-2022 న జరిగే వెరిఫికేషన్ లొ కార్మిక పక్షపాతి అయిన NFTE BSNL గుర్తు బాలెట్ లొ సీరియల్ నెంబరు 13 పై తమ పవిత్ర ఓటు వేసి NFTE BSNL ను మొదటి ప్రాధాన్యతా యూనియన్ గా ఎన్నుకొని మనందరి భవిష్యత్తు , సంస్థ మనుగడ కు సహకరించి , EU కు గుణపాఠం చెపాలని ప్రార్ధన.
ఇట్లు
కె అంజయ్య. సర్కిల్ కార్యదర్శి
ఏ పి సర్కిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *