BSNL కు కేంద్ర కేబినెట్ ప్రకటించిన రివైవల్ పాకేజి సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి వర్యులు మీడియా తో మాట్లాడుతూ , ఉద్యోగులు సంస్థ అభివృద్దికి కష్టపడి పనిచేయాలని, రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేయాలని, ఇష్టం లేని వారు VRS పెట్తుకొని ఇంటికి వెళ్లి పోవాలంటూ, లేనిచో CDA రూల్స్ లోని ఆర్టికల్ 56J ప్రయోగించి తామే ఇంటికి పంపుతామని బెదిరిస్తూ ప్రకటించటాన్ని BSNL ఉద్యోగులు మరియు అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండించాల్సి ఉంది. సంస్థను అభివృద్ది పధం లోకి ఏవిధంగా తీసుకు పోవాలో ఏమాత్రం సూచన చేయలేదు సరిగదా !బెదిరింపులు తో ఉద్యోగులను భయాంధోళనలకు గురిచేయటం జరిగింది. ప్రవేటు కంపెనీలు 2012 నుండి 4G సర్వీసులు ప్రారంభించి , ఇపుడు 5G సర్వీసులు ఇవ్వటానికి వేలం లొ స్ప్రెక్ట్రం ను కొని రడిగా ఉన్నాయి. కాని BSNL ఇంకా 2G,3G తో నె సర్విసులు నడుపుతూ strugle అవుతున్నాయి. అక్టొబరు 2019 లోనే 4G సర్వీసులును BSNL సంస్థకు కేంద్ర కేబినెట్ ప్రకటించినా , ఇంతవరకు అమలు జరగలేదు. పైగా ఇపుడు ప్రకటించిన పాకేజి లొ కూడ 4G సర్విసులు ప్రారంభించటానికి రెండు సంవస్థరాలు పడుతుందని తెలియ చేయటం జరిగింది. 4G,5G సర్వీసులు లేకుండా , కేవలం 2G,3G టెక్నాలజీ తోనె పనిచేస్తున్న Bsnl ఉద్యొగులు ప్రవేటు కంపెనీలతో పోటి పడి సంస్థను లాభాల బాటలోనికి తీసుకు రావటం ఎలా సాధ్య పడుతుందో సెలవివ్వని మంత్రి వర్యులు ఉద్యోగులను ” పని చేయండి లేదా ఇంటికి పొండి ” అని ఎలా చెప్పగలరు ? ఆయుధాలు లేకుండా యుద్ధ భూమిలొ ఉన్న సైనికులు లాంటి వారే , ఈ నాటి మన BSNL ఉద్యోగులు. అయినా చిత్త శుద్దితో సంస్థ అభివృద్దికి అపర్ణిశలు కష్టపడుతున్నారు. వార్ని అభినంధించాల్సిన మంత్రి వర్యులు ఉద్యోగులను బెదిరిస్తూ వారి మనో ధైర్యాన్ని దెబ్బ తీయటం సరైంది కాదు. MTNL కు భవిష్యత్తు లేదని సెలవిచ్హిన మంత్రి గారు , ఆ సంస్థ ఈ స్థితి కి రావటానికి కారకులైన దాని పూర్వ CMD గారైన ప్రస్తుత BSNL CMD శ్రీ పుర్వార్ పై చర్యలు తీసుకుంటారా ? కావున ఉద్యొగులు , అన్ని సర్వీసు యూనియన్లు , అసోషియేషన్లు కమ్యునికేషన్ మంత్రి గారి బెదిరింపు ప్రకటనను ఖండించాల్సిన అవరం ఎంతైనా ఉన్నది. కె . అంజయ్య సర్కిల్ కార్యదర్శి
Related Posts
14 DecState News