16-6-2023:: సర్కిల్ మేనేజ్మెంట్ అనుసరిస్తున్న వివక్షతను వ్యతిరేకిస్తూ 30-6-2023 ధర్నా ✊

NFTE సమస్యలఎడల సర్కిల్ మేనేజ్ మెంట్ అనుసరిస్తున్న వివక్షతకు వ్యతిరేకంగా
” ధర్నా “
తేది. 30-06-2023 విజయవాడ
🔺🔺🔺🔺🔺🔺🔺🔺
కామ్రేడ్స్ ,
గత కొంతకాలంగా సర్కిల్ మేనేజ్మెంట్ ఉద్యోగుల సమస్యల ఎడల (ముఖ్యంగా NFTE )దాటవేత విధానాన్ని పాటిస్తూ ,నిర్లక్ష వైఖరిని అవలంభిస్తుంది. న్యాయంగాను , ట్రాన్స్ఫర్ పాలసి కి అనుగుణంగా ఉన్న భార్యా భర్తల బదిలీల లొ ఎగ్జిక్యూటివ్ లకు ఒక విధానం , నాన్ ఎగ్జిక్యూటివ్ లకు ఒక విధానం అనుసరించటం మరియు రూలు-8 బదిలిలలొ కార్పోరేట్ ఆఫీసు ఉత్తర్వులను పాటించకుండా అధికారులు వారి ఇష్ట ప్రకారంగా నిర్ణయం తీసుకొవటం జరుగుతుంది.
🔴 R-8 బదిలీలపై ఇతర జిల్లాల నుండి ఎ పి సర్కిల్ కి వచ్చిన JE కేడరు ఉద్యోగులకు పోష్టింగులు ఇచ్చే సమయం లొ ఈ సర్కిల్ లో పెండింగులొ ఉన్న రిక్వెష్టు బదిలీలను ఇచ్చి ఆయా స్టేషన్ల లొ సర్దుబాటు చేసేవిధానాన్నిపాటించకుండా పక్షపాత వైఖరితో ఎక్కువ స్టాఫ్ ఉన్న స్టేషన్ల లొ సైతం పోష్టింగులు ఇవ్వటం జరిగింది. కాని మన సర్కిల్ యూనియన్ అడిగిన న్యాయ మైన బదిలిలు ( నోటీసులొ తెలిపినవి ) మాత్రం ఆక్టోబరు 2022 నుండి పెండింగులో ఉంచి కుంటి సాకులతో కాలయాపన చేయటం జరుగుతుంది.
🔴 ఇటివల CGM గారు సర్కిల్ యూనియన్ గట్టిగా పై సమస్యలమీద పాయింట్ అవుట్ చేయగా , నేను మీరు అడిగిన బదిలీల విషయాన్ని చూస్తానన్నాను గాని , ఇస్తానని చెప్పలేదు అని బుకాయించటం వారి నిర్లక్షతను , గుర్తింపు యూనియన్ అయిన NFTE యూనియన్ సమస్యల ఎడల వారికున్నఅభిప్రాయం బహిర్గతం అయ్యింది.
🔴 GM HR అయితే ఏకంగా TT , JE కేడరును గుంటూరు రిక్వెష్ట్ బదిలివిశయం లొ ఒకే కేడరుగాట్రీట్ చేస్తున్నామని చెప్పటం మన యూనియన్ సమస్యల ఎడల వారి కున్న శ్రద్దఏపాటిదోతెలియచేస్తుంది
🔴ఇక జిల్లాలోని మేనేజ్మెంట్లు ఆయా జిల్లా లలొ మన సభ్యులు సమస్యల ఎడల సరైన వైఖరిని అవలంభించటం లేదని సర్కిల్ యూనియన్ ద్వారా సర్కిల్ మేనేజ్మెంట్ దృష్టికి తెచ్చినప్పుడు , జి యం హెచ్ ఆర్ నుండి , మీరు జిల్లా లలొ తేల్చుకోమని సలహా ఇవ్వటం వారి భాద్యతా రాహిత్యాన్ని తెలియచేస్తుంది.
🔴 ఇక ముఖ్యమైన సర్కులర్ల ను , ఉత్తర్వులను గుర్తింపు యూనియన్లకు ఇవ్వాలనే కార్పొరేట్ ఉత్తర్వులు పాటించటంలొ నిర్లక్ష్యం వహించటం,
🔴యూనియన్ ఉత్తరాలకు సమాధానం ఇవ్వకుండా అలాంటి రూల్స్ లేవని సమాధానం చెప్పటం జరుగుతుంది. సమస్యను పరిష్కరించకుండా , సమాధానం ఇవ్వకుండా ఉండటం గుర్తింపు యూనియన్ ను మేనేజ్ మెంట్ ఖాతరు చేయటం లేదని తెలుస్తుంది.
ఈ పరిస్థితులు మొత్తం ను మన సర్కిల్ యూనియన్ తీవ్రంగా పరిగణించటం జరిగింది.అందుచేత మన యూనియన్ ప్రతిష్టత ను మరియు గౌరవాన్ని సర్కిల్ లొను , జిల్లాలోనూ నిలబెట్టు కోవాలనే భావన తో నిరసన ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచి ట్రేడ్ యూనియన్ నోటిసును తేది. 14-6-2023 న సర్కిల్ మేనేజ్మెంట్ కు ఇవ్వటం జరిగింది.
🔴 ఆందోళనా కార్యక్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది. ఇది స్థానిక సమస్యలపైన ఉన్న నిర్లక్ష్యాన్ని మరియు సర్కిల్ మేనేజ్మెంట్ కు మన యూనియన్ ఎడల ఉన్న వైఖరిని నిరసిస్తూ చెస్తున్న ఆందోళన కావున దీన్ని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకతను జిల్లా కార్యదర్శులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Date :: 28-06-2023
అన్ని జిల్లా కేంద్రాలలొ జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు క్రియాశిలక సభ్యులు తొ భోజన విరామ సమయం లొ ” నిరసన ప్రదర్శనలునినాదాలు ” చేస్తూ ఆంధోళన పరిస్థితులను సభ్యులుకు వివరించాలి.
Dt. 30-06-2023
సర్కిల్ ఆఫీసు ముందు విజయవాడలొ ” నిరసన ధర్నా ” సర్కిల్ కార్యవర్గ సభ్యులు మొత్తం , జిల్లా సెక్రటరీలు మరియు మహిళా కో ఆర్డినేట్ కన్వీనరు , చైర్మన్ల తో పాటుగా ఆ కార్యవర్గ సభ్యులు కూడ ధర్నా లొ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఇట్లు
కె అంజయ్య, సర్కిల్ కార్యదర్శి
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *