20-9-2022:: నెల్లూరు లో ఎన్నికల ప్రచార సభ
నెల్లూరు జిళ్లా NFTE ఎన్నికల ప్రచార సభ NFTE జిళ్లా యూనియన్ ఆఫీసు నందు తేది 20-9-2022 న కామ్రేడ్ రంగయ్య జిళ్లా అధ్యక్షుని అధ్యక్షతన జరిగింది. జిళ్లా కార్యదర్శి కామ్రేడ్ పి జిలాని ఖాన్ ఆహ్వానితులందని వేదిక పైకి ఆహ్వానించారు. జిళ్లాలోని అన్ని ఏరియాలనుండి 25 మంది సభ్యులు హాజరైనారు. సర్కిల్ కార్యదర్శి కె అంజయ్య , సహాయ కార్యదర్శి కె వి యతీంద్రనాధ్ , pwa జిళ్లాకార్యదర్శి సూర్యనారాయణ హాజరైనారు. మీటింగు అనంతరం సర్కిల్ కార్యదర్శి , సహాయ కార్యదర్శి ఇద్దరు సేవా జిళ్లాకార్యదర్శి బ్రదర్ సురెష్ ను కలిసి జిళ్లాలొ సేవా సభ్యుల మద్దతు ను ఎన్నికలలో NFTE కి కోరటం జరిగింది. జిళ్లా కార్యదర్శి సురేష్ చాలా సంతోషం గా వారి సర్కిల్ కార్య దర్శి ఆదేశాలు ప్రకారంగా NFTE యూనియన్ కు తమ సభ్యులు మద్దతు తప్పని సరిగా ఉంటుందని తెలియ చేసారు. కార్యక్రమ నిర్వహరణ మొత్తం NFTE జిళ్లా కార్యదర్శి కామ్రేడ్ పి జిలాని ఖాన్ నిర్వహించారు. సేవా – Nfte ఐక్యంగా జిళ్లా లొ గెలుపుకు కృషి చెయాలని నిర్ణయించటంజరిగింది.
Related Posts
02 DecState News