30-7-2022:: BSNL పాకేజి పై అనుమానాలెన్నో ?

ప్రియమైన కామ్రేడ్స్ , . కేంద్ర కేబినెట్ BSNL పునరుజ్జీవనం కొరకు తేది .27-7-2022 న 1-64 లక్షల కోట్లు పాకేజీని ఆమోదించినదని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి వర్యులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు తెలియచేసిన విశయం అందరికి తెలిసిందే ! BSNL కు గతంలో 23-10-2019 న ఇచ్హిన పాకేజీ అనుభవం ఉద్యోగులుకున్నది. ఆ పాకేజీ తో కేంద్ర ప్రభుత్వం VRS రూపంలో 78,649 ఉద్యోగులను తొలగించింది. 4 జి స్పెక్ట్రం ఇస్తామన్న హామీని ఇంతవరకు అమలు చేయలేదు. సరిగదా ఉద్యోగులకు సకాలం లో వేతనాల చెల్లింపులు జరగని పరిస్థితి ఉన్నది. దాదాపుగా 70 శాతం సంస్థలోని పనులు , సర్వీసులు ప్రవేటు వెండార్స్ కు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం సర్వీసులొ ఉన్న 63 వేల మంది ఉద్యోగులుకు జనవరి 2017 నుండి జరగాల్సిన వేతన సవరణ జరగలేదు , ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం ,కేడరు ప్రమోషన్ల విశయం లొ సానుకూల నిర్ణయం , టైం బౌండ్ ప్రమోషన్లు అమలు తదితరములు పరిష్కరించకుండా కాల యాపన చేయటం జరుగుతుంది. ఈ రెండవ పాకేజి సహజంగానే కొంతమేరకు సంస్థకు ఉపయోగ పడ్తుంది. కొంతకాలం (4 y) పాటు వివిధ టాక్స్ ల నుండి వెసలుబాటు ఉంటుంది. కాని అదే సమయంలొ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి బెదిరింపులు కూడా ఉన్నాయి. “పనిచెయ్యి (10 గం )లేదా వెళ్లి పో ” (Either perform or perish) . ఆ విధం గా మేనేజ్మెంట్ ఉత్తర్వులు కూడ ఇవ్వటం జరిగింది. ఒక వైపున ఉద్యోగులు వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా , మరో వైపున ప్రభుత్వ బెదిరింపులతో వారు రిటైర్మెంట్ సమయం వరకు ఉద్యోగ సర్వీసులొ కొనసాగటం జరుగుతుందా ?అనె అనుమానాలు కలుగుతున్నాయి. మరొక ఆంధోళన కల్గించే ముఖ్య విశయం – ఒక వైపునకేంద్ర ప్రభుత్వం 14917 BSNL మొబైల్ టవర్లను , ఆప్టికల్ ఫైబర్ ను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ క్రింద ప్రవేటికరించి 40 వేల కోట్లు ఆర్జించాలని ప్రతిపాదిస్తూ , రెండవ పాకేజి ద్యారా టవర్ల ఏర్పాటు , ఆఫ్టికల్ విస్తరణ చేయాలంటుంది. అదే జరిగితే BSNL ఈ మానిటైజ్ చేసిన టవర్లను వినియోగించుకొని మొబైల్ సర్వీసులు ఇస్తూ అందుకు పెద్ద మొత్తాలలొ అద్దె రూపంలొ చెల్లింపులు చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కనుక చిత్త శుద్ది తో BSNL ను పునరుజ్జివం చేయాలనుకుంటె , ” నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ” నుండి సంస్థకు మినహాయింపు ఇవ్వాలి. అపుడె ఈ పాకేజి వాస్తవంగా BSNL కు ఉపయోగ పడుతుందనటం లొ ఎలాంటి సందేహం లేదు. ఒక వైపున కేంద్ర మంత్రి BSNL PSU వ్యూహాత్మక సంస్థగా ప్రభుత్వరంగ సంస్థగానే ఉంటుందని చెప్పుతున్నా , ఉద్యోగులలొ భయాంధోళనలు తొలగి పోవటం లేదు. కారణం ఏమనగా మరో వైపున నీతి ఆయోగ్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరించాలనే లిష్టు లో BSNL కూడ ఉన్నది. కాబట్టి ఈ పాకేజి తో సంస్థను అభివృద్ది చేశాక , ముఖ్యమైన కొన్ని సర్వీసులును ప్రవేటికరంచరనే గ్యారంటి లేదు. కావున భవిష్యత్తు లొ జరిగే పరిణామాలను జాగరూకతొ గమనిచాల్సి ఉంటుంది. . కామ్రేడ్ చందేశ్వర్ సింగ్ , జనరల్ సెక్రటరి NFTE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *