సేవా జిల్లా కార్యదర్శులకు, జిల్లా అధ్యక్షులకు మరియు సేవా సభ్యులకు సర్కిల్ కార్యదర్శి తెలియజేయు విన్నపము::. సేవా బి.యస్.యన్.యల్, vs నాన్ ఎగ్జిక్యూటివ్ ట్రేడ్ యూనియన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BSNL లొ పనిచేస్తున్న సేవా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ సొదర సోదరీ మణులందరికి జై భీమ్ లు.,
2022 బి.యస్.యన్.యల్.లో తొమ్మిదోవ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ వెరిఫికేషన్ తో సేవా వారికి ఏమిటి సంబంధం? ఎందుకు వీళ్ళ అసోసియేషన్ ఒక ట్రేడ్ యూనియన్ కు మద్దతు పలుకుతున్నారు? ఉద్యోగులకు ఉన్న ఓటు హక్కుని స్వతంత్రంగా తమ కిష్టమొచ్చిన యూనియన్ కు ఓటు వేసుకొనివ్వచ్చు కదా? ఏమిటి సేవా నాయకుల వ్యవహార శైలి?, సత్యమేంత? ….అసత్యమేంత? .
ఓటుహక్కు వినియోగించుకునే ప్రతి సేవా మెంబర్లు తెలుసుకోవలసిన అవసరం ఉంది.
వ్యవస్థ క్లిష్టపరిస్తితిలో ఉన్నప్పుడు మేధావి మౌనం సమాజానికి ప్రమాదకరం మాట్లాడవలసిన టైంలో మాట్లాడక పోవడం కూడా నేరమే, ఒక సమాజాన్ని నడిపించాల్సిన నాయకత్వాలు జరుగుచున్న అన్యాయాలను వ్యతిరేకించకుండా మౌనం పాటించటం, సమాజాన్ని చైతన్య పరచకుండా బానిసత్వాంలోకి నెట్టివేయడమే అవుతుంది.
డాక్టర్ బాబాాహెబ్ అంబేడ్కర్ గారి స్పూర్తితో బోధించు! సమికరించు!! పోరాడు!!!, అనే సూక్తులను అనుసరించి BSNL లో ఒక ట్రేడ్ యూనియన్ (BSNLEU) దుర్మార్గాలను, సంస్థ అభివృద్ధి లో అసమర్థ పోకడలను, మరియూ సేవా వ్యతిరేక విధానాలను, అందరికీ తెలియజేయాలని సేవా ఈ 9వ మెంబర్షిప్ వెరిఫికేషన్ లో NFTE BSNL కు మద్దతు పలుకుతున్నారు.
ఇక కొంత విషయానికొద్దాం.
BSNL ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు (మొదటిసారి తప్ప), అన్ని ఎలక్షన్లలో BSNLEU నే ప్రథమ యూనియన్ గా గుర్తింపు హోదాలో ఉన్నదనుటలో ఎవ్వరికీ సందేహం లేదు.
1.) BSNL టవర్లు ప్రత్యేక కంపెనీగా మార్పు చేసినా, దానిని నిలుపుదల చేయుటకు వారు ఒంటరిగా ఉద్యమాలు లేవు.
2.) 4 జి స్పెక్ట్రమ్ వేలంలో BSNL కూడానూ పాల్గొనే విధంగా ప్రథమ ఉద్యోగ సంఘం గా ఉద్యమాలు లేనేలేవు, ఏమీ చేయలేకపోయారు, అందరికీ జీతల్లో కోతలు తప్ప.
3) నాన్ ఎగ్జి్యూటివ్ ఉద్యోగులకు వాషిన్ ఎలవెన్స్, ట్రాన్స్పోర్ట్ ఏలవెన్స్, మెడికల్, ఇత్యాది అలవెన్సు లన్ని తీసివేసినా సొంతంగా ఉద్యమాలు లేవు,
4) 2019 లో VRS వ్యతిరేకించకుండా అందరూ VRS తీసుకుని ఇంటికి వెళుతుంటే ఉద్యమాలు లేవు. ప్రేక్షక పాత్ర వహించారు.
5). జియో లాంటి నెట్వర్క్ సంస్థలకు మన యాక్చెంజిల్లో నెట్వర్క్ కోసం రూములు షేరింగ్, కరెంట్ షేరింగ్, ఆఖరుకి ఉద్యోగులను వారి మేయింటినెన్స్ కి వాడుకుంటున్నా ఉద్యమాలు లేవు, కళ్లుండి గుడ్డివాడిలా అసమర్థ నాయకత్వం.
6). వీరి చేతగాని తనానికి,అసమర్ధతకు మరో పేరు AUAB అనే పేరు పెట్టి, అన్ని యూనియన్ లను అసోసియేషన్ లను బ్రతిమలాడి, అందరి సామూహిక సామర్ధ్యం తో చేసిన ఉద్యమాలను వారి సామర్ధ్యం గా చూపించు కొనుచూ జబ్బలు చరుచుకొనుచూ గొప్పలు చెప్పుకోవడమే, ఉద్యోగుల మద్దతు లేకపోయినా మళ్ళీ అధికారం కోసం సిగ్గు లేకుండా సత్యదూరమైన ప్రచారానికి వారి నాయకత్వం పాల్పడుచున్నది.
ఇక సేవా విషయానికొస్తే
- 2007 వ సంత్సరం సేవా గుర్తింపు దగ్గరనుండి సేవాకు ఫార్మల్ మీటింగ్ లు ఎలా ఇస్తారు? అని సేవా కార్యక్రమాలకు అడు గడుగునా అడ్డుపడటం, సెవాకు వాళ్లకు వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వం ఇచ్చుటలో అడ్డుపడటం, ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పలసిలలో సేవా ఇన్వాల్వ్ మెంట్ అడ్డుపడుటం, BSNL అభివృద్ధి విషయాలు సేవా మాట్లాడితే సేవా వాళ్లకు హక్కు లేదని వారికి వ్యతిరేకంగా మేనేజ్మెంట్ మీద వత్తిడి చేయటం.
- బ్యాక్లాగ్ ST వేకెన్సి లను జనరల్ కేటగిరీ కి మల్లించమని BSNL కి ఉత్తర ప్రత్యుత్తరాలు వ్రాయటం.
- సేవా ఇంటర్నల్ ఎలక్షన్లలో, కొంతమంది EU
బానిస లచేత గ్రూపులు, గొడవలు రేపి, సేవాని బలోపేతం కాకుండా కుట్రలు చేసినది.. చేస్తున్నది BSNLEU.కాదా? - సేవా నాయకత్వం మీద తమిళనాడు లో కోర్టు కేసులు పెట్టి 70,80 లక్షలకు శూటు వేసి ఆర్థికంగా సెవాని ఇబ్బందులకు గురిచేసినది BSNLEU కాదా?
- అన్ని జిల్లాలలో సేవా నాయకులను బెదిరించే లాగున తప్పుడు కంప్లైంట్స్ ఇప్పించినది BSNLEU కాదా?
- సేవా నాయకత్వంను దాని అభివృద్ధి నీ నిర్వీర్యం చేయాలని, అటు ఉద్యోగులలోనూ, ఇటు డిపార్ట్మెంట్ వద్ద తన అసత్యాలతో, అక్కసుతో విషాన్ని కక్కుతున్న BSNLEU ని ఈఎన్నికలలో ఓడించి NFTEBSNL. కు మద్దతు పలుకటం నాయకులుగా సేవా వారికి హక్కులేదా?
- సేవా కు వారి హక్కులను అన్నివేళలా వెన్నంటే ఉండి సేవావారి హక్కులను గౌరవించి, అవసరమైతే సేవా వారి కోసం AUAB లో కూడా తప్పుకొనటానికైనా సిద్ధపడిన NFTEBSNL కు మద్దతు ఇవ్వుట నేరమా…?, ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఎవరో స్రిప్ట్ వ్రాసి ఇస్తే దాన్ని వాట్స్ యాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి అసత్య ప్రచారాలు చేసుకునే బాపతు BSNLEU వారిది, కొంతమంది తెలిసి-తెలియని వారిచే మాట్లాడించడమే EU నాయకత్వపు పని.
వారి ప్రవర్తనా పోలికలన్ని ……చేతిలో కత్తి..నాలుక మీద దేవుని జపం మాదిరి వలే ఉంటుంది
ఇంకా చెప్పాలంటే వారి దుష్ట కుయుక్తులు, కుట్రలు, చేతగాని తనం, వ్రాయటానికి పేజీలు చాలవు, కావునా ఈ 9వ BSNL naan ఎగ్జిక్యూటివ్ యూనియన్ మెంబర్షిప్ వెరిఫికేషన్ లో సేవా నాయకత్వం అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి NFTEBSNL కు మద్దతు ఇవ్వుట అనివార్యం అయినది, ఇది అవసరం కూడా. కావునా సేవా సభ్యులందరూ ఈనెల అక్టోబర్ 12వ తేదీన జరగబోవు BSNL నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ల మెంబర్షిప్ ఎన్నికలలో NFTE-BSNL కు ఓటువేసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో BSNL పరిరక్షణకు, మరియూ SEWA బలోపేతానికి, పార్లమెంట్ ద్వారా, నేషనల్ కమిషన్ ద్యారా గుర్తింపు పొంది, రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కులను ఉన్నవి ఉన్నట్లుగా, ఎవరూ అడ్డుకోకుండా అమలు చేసే విధంగా ఉండాలంటే ఈ ఒక్కసారి అవకాశం Sl.No.13 NFTE-BSNL కు ఓటువేసి, ఇన్నాళ్లు హీరో లాగా నటించిన అసమర్థ BSNLEU నాయకత్వానికి సరైన బుద్దిచెప్పండి. జై భీమ్… జై సేవా…జై జై భీమ్… ఇట్లు M. PRASAD BABU,. CIRCLE SECRETARY-SEWA, AP CIRCLE,VIJAYAWADA