NFTE KADAPA DIST PRESIDENT COM S M PEERA
Dst Secretary kadapa com T Gangadharareddy JTO
com V Roushan Jameer JE Treasurer

29-5-2023:: Kadapa NFTE Dist conference

👏👏👏👏👏👏👏👏డియర్ కామ్రేడ్స్ ,
తేది 29-05-2023 న NFTE BSNL కడప OA జిళ్లా యూనియన్ మహాసభ కడప DGM op ఆఫీసు ప్రాంగణం లొ కామ్రేడ్ జి. శ్రీపతి రావు TT అద్యక్షతన జరిగింది. సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్ కె. అంజయ్య హాజరైనారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఈ క్రింది వారితో ఎన్నుకోవటం జరిగింది.
జిళ్లా అధ్యక్షులు : కామ్రేడ్ S.M. Peera Rtd. TT కడప
జిళ్లా కార్యదర్శి : కామ్రేడ్ T. గంగాధర రెడ్డి JTO వేంపల్లి
జిళ్లా కోశాధికారి. : కామ్రేడ్ V రోషన్ జమీర్ JE ప్రొద్దటూరు
నూతన కార్యవర్గానికి సర్కిల్ యూనియన్ అభినందనలు తెలియచేస్తుంది.
💐💐🍀🍀🍀🍀💐💐💐

Dt. 27-05-2023:: సర్కిల్ మేనెజ్మెంట్ తో NFTE సర్కిల్ యూనియన్ కలిసిన సందర్భంగా తెలియచేసిన అంశాలు !

డియర్ కామ్రేడ్స్,
మన సర్కిల్ యూనియన్ తో CGM – సురేష్ కృష్ణ గారు మాట్లాడుతూ మన ఏ.పి సర్కిల్ ప్రాఫిట్ పోయిన సం// 900కోట్లుతో పోలిస్తే ఈ 2022-23 సం// కొంత తగ్గింది. అయినను మన సంస్థ ఆపరేషన్ల్ ప్రాఫిట్ కొంత పెరిగింది. వచ్చే సం//కు గాను మన సర్కిల్ 1250కోట్లు రెవెన్యూ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలియజేశారు. మొబైల్ రంగంలో మన మార్కెట్ షేర్ 10% నుండి 5%కు తగ్గింది అని, ఈ సం// అక్టోబర్-నంవబర్ కు ప్రతి టవర్ ను 4G గా మార్చటం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు. మనం కోల్పోయిన 5% శాతం కస్టమర్లను తిరిగి వచ్చే విధంగా ఎంప్లాయిస్ అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి నెలా సరాసరి, ఒకో CSC నుంచి 5000సిమ్స్ అమ్మకాలను 10000సిమ్స్ పెంచాలని అభ్యర్థించారు. ఈ నెల FTTH కనెక్షన్లు భారీ ఎత్తున డిస్కషన్ కు వచ్చాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. TIP ఆపరేటర్లు బాధ్యతగా లేకపోతే మన సంస్థే ప్రతి ఎక్సేంజ్ లో OLTEను ఇన్స్టాల్ చేస్తుంది అని తెలిపారు. అవసరం అయితే 5000 OLTEs ఇన్స్టాల్ చేయటానికి సర్కిల్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉందని తెలిపారు.
మన సర్కిల్ యూనియన్ తో Sr.GM (HR) – సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ TT,JE,JTO కేడర్ లో ఉన్న ఖాళీలను తెలియజేశారు. 2025-26 సం// కు మన సంస్థ పూర్తి ఆర్ధికంగా నిలవాలి అని ప్రభుత్వం నిర్దేశించింది అని తెలిపారు. అందుకు గాను ప్రతి ఒక్క ఉద్యోగి కష్టపడి పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
మన సర్కిల్ యూనియన్ తో GM (EB) – వెంకటప్రసాద్ గారు మాట్లాడుతు మన సర్కిల్ లో ఉన్న 4422 టవర్లను 4G కు అనుసంధానం చేస్తున్నాం అని, ప్రతి ఒక్క టవర్ ను 4G+2G టవర్ గా మార్చటం జరుగుతుంది అని, 3G కు వాడిని బ్యాండ్ విడ్త్ ను కూడా 4G కు కేటాయింపు చేస్తామని తెలిపారు. మన సర్కిల్ కు 4G శ్యచురేషన్ ప్రాజెక్ట్ కింద 1900 4G టవర్లను కేటాయించటం జరిగింది. ఈ 1900 టవర్లకు సంబంధించిన పూర్తి ఖర్చు 10సం// వరకు కేంద్రమే భరిస్తుంది అని తెలియజేశారు.
కె.అంజయ్య
సర్కిల్ కార్యదర్శి, ఎన్ ఎఫ్ టీ

27-5-2023:: Ap circle CCM held on 27-5-2023

ఈ రోజు 27-5-2023 తొమ్మిదవ సర్కిల్ కౌన్సిల్ సమావేశం విజయవాడ ఆఫీసు కాంఫెరెన్స్ హాలు నందు జరిగింది. మన NFTE నుండి సర్కిల్ కార్యదర్శి కా . కె . అంజయ్య సర్కిల్ కౌన్సిల్ లీడరు , కా. కె. వి. యతీంద్రనాధ్ ఎ సి యస్. , కా . బి. కొండప్ప డి .యస్. అనంతపూర్ , కా. కె. వెంకటేశ్వరరావు డి .యస్.వెస్ట్ గోదావరి మరియు కా. ప్రసాదు ఈస్ట్ గోదావరి ,సర్కిల్ కోఆర్డినేటరు హాజరు అయినారు.

29-5-2023::. JTO, JE, Vacencies for AP circle arised for FY 2022

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
JTO-JE LICE FY-2022 ఖాళీల సమాచారం.
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
డియర్ కామ్రేడ్స్ ,
పైన తెలియచేసిన కేడర్ల కు AP సర్కిల్ లొ పరీక్షలు జరపటానికిగాను , ఎ పి సర్కిల్ ఆఫీసు వారు ఈ క్రింది విధంగా ఖాళీలను గణించి కార్పోరేట్ ఆఫీసు వారికి అనుమతి కొరకు పంపటమైనది.

1- JTO Vacencies from Jan/2022 to Dec/ 2022

➡️vacencies arised due to Death, Resignation, promotion =16
➡️ sanctioned strength (-)working strength = 72
➡️Taken lowest figure is = 16
➡️ 50% LICE is to be taken only -8 ( for out side -8)
➡️ Break up – OC -7 Sc-1 out of total 8. one post be for PWBD


JE vacancies for FY 2022


ఖాళిలు ప్రమొషన్ , రిటైర్మెంట్ వల్ల వచ్హింది -15
➡️ శాంక్షన్ మైనస్ – వర్కింగ్ =45
➡️తక్కువగా ఉన్నది తీసుకోవాలి ప్రస్తుత రూలు ప్రకారంగా , అయితే = 15
➡️ 50% LICE కి వచ్హేది – 8
బ్రేక్ అఫ్ oc – 7 sc – 1 ఈ మొత్తం 8 లొ ఒకటి PWBD కోటాకు వెల్లుతుంది.
ఇది సభ్యుల కు సమాచారం . JTO, JE, TT పోష్టుల LICE ప్రమోషన్ పరీక్షలు అన్ని ఒకే సారి 28-8-2023 జరుగు తాయని కార్పోరేట్ ఆఫీసు ఇంతకు ముందే తెలియ చేసింది. పరీక్షలుకు ప్రిపేర్ అవ్వాలనుకునే వారు ఇప్పటి నుండె ప్రయత్నాలు మొదలుపెట్తండి.
కె. అంజయ్య , సర్కిల్ కార్యదర్శి
🌹🌹🌹🤙🌹🌹🌹🌹🌹

జాయింట్ ఫోరం ఆఫ్ BSNL యూనియన్స్ కాల్ ను జయప్రదం చేయండి – NFTE GS పిలుపు

All the Circle/District Secretaries are requested to start mobilization of workers for success of 1st phase of agitational programme call
(i.e. Human Chain with play cards on 01-06-2023) given by the Joint forum of non-executive unions/associations.

And make the programme a big success with the co-operation of all unions and pensioner associations —

G.S. NFTE (BSNL)