ఆలిండియా మహాసభలు తేది 28 ఆగష్టు నుండి 30 తేది వరకు రాంచి జార్ఖాండ్ రాష్ట్రం ••••••••••
జిళ్లా కార్యదర్శులకు సర్కిల్ యూనియన్ విజ్ఞప్తి మరియు సూచన —
డియర్ కామ్రేడ్స్.
జనరల్ సెక్రటరి చందేశ్వర్ సింగ్ ఈ రోజు (27/6/2022) వాట్స్ యాఫ్ మెసేజ్ ద్యారా ఆగష్టు 28 to 30 వరకు ఆలిండియా మహా సభలు జార్ఖాండ్ రాష్ట్రం “రాంచి” నగరం లొ జరుగుతున్నాయనియు, కార్య వర్గ సమావేశం 27 న జరపబడుతున్నాయని నోటిఫికేషన్ త్వరలొ ఇస్తామని. ఈ లోగా రైల్ టికెట్స్ రిజర్వ్ చేసుకోమని తెలియ చేయటం తో పాటుగా, ప్రస్తుత పరిస్థులలొ వసతి సౌకర్యం ఏర్పాటు కష్టం గా ఉంటుందని, కావున గతం లొ మాదిరికి భిన్నంగా. ఈ సారి ఈ మహాసభలు కు డెలిగేట్స్ ను మన యూనియన్ నిభంధనావళి ప్రకారంగా ప్రతి 50 మంది సభ్యులుకు 1 (ఒక) డెలిగేట్ మాత్రమె అనుమతించటం జరుగుతుందని తెలియచేసారు. డెలిగేట్ ఫీజు RS. 2000/-గా నిర్ణయించటం జరిగింది. ఈ ప్రకారం గా మన సర్కిల్ కు 600 మంది సభ్యులుకు గాను 12 మంది డెలిగేట్స్ మాత్రమే అర్హులు. కావున జిళ్లా కార్యదర్శులు మీ జిళ్లా సభ్యత్వం ప్రకారంగా డెలిగేట్స్ ను నిర్ణయించుకొవాల్సి ఉన్నది. సర్కిల్ కార్యదర్శిని సంప్రదించి మాత్ర మె జిళ్లా కార్యదర్శులు డెలిగేట్స్ కు టికెట్లు రిజర్వ్ చేసుకోవాలి. డెలిగెట్స్ ను అనుమతించటంలొ సర్కిల్ నుండి ఎక్కువగా వచ్హిన వారి వసతి వగైరా విశయాలలొ సర్కిల్ యూనియన్ భాద్యత వహించదని తెలియ చేస్తున్నాము. కొంత మంది ఓత్సాహితులు రిటైర్ వారితొ సహా మహాసభలకు రావాలని అడుగుతున్నారు. అందువల్ల ఈ సమాచారాన్ని సర్కిల్ యూనియన్ ఇవ్వవలసి వచ్హింది. మనకు 14 మంది జీళ్లా కార్యదర్శులు ఉన్నారు. వారందర్ని మహాసభలకు వస్తామంటె అనుమతించాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్ట్రి లొ ఉంచుకొని జిళ్లా కార్య దర్శులు సహకరించాల్సి ఉన్నది.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి.