*🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏿కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా 101 వ జయంతి
కామ్రేడ్స్
టెలికం లొ లక్షలాది మందిని ప్రత్యేకంగా CM,PTE,RM,LM తదితర క్రింది స్థాయి ఉద్యోగుల ఆర్ధిక స్థితి ని మార్చటమే కాకుండా,వారికి సమాజం లొ గౌరవ ప్రతిష్ట లు కల్పించిన మహనీయుడు కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా. P&T డిపార్ట్మెంట్ క్రింద ఉన్నప్పుడు టెలికం ఉద్యోగులకు 1. పే కమీషను అమలు 2. ధరల సూచిక ననుసరించి ఉద్యోగులకు DA ఫెంపుదల మరియు 3. టైం బౌండ్ ప్రమోషన్లు అమలు పర్చిన దూరదృష్టి గల మహనీయుడు.
🔴P&T నుండి టెలికం విడిపొయిన తరువాత అందులొ ఉన్న లక్షలాది మంది కాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించటం జరిగింది. అదే పొష్టల్ లొ ఈనాటికి ED ఉద్యోగులు ఇ డి లు గానే ఉన్నారు.
మిగిలిన కాజువల్స్ కు (TSM) టెంపరరి స్టెటస్ విధానాన్ని అమలు పర్చి వారందరి భవిష్యత్తు కు భరోసా కల్పించారు. 1990 లొ టెలికం లొ వస్తున్న టెక్నాలజీ మార్పులను గమనించి నూతన కేడర్లు అయిన TM, TTA , SR TOA , RM ను రీస్ట్రక్షరింగ్ కేడర్లుగా మార్పు చేయించి , పె స్కేల్స్ను ను రీస్త్రక్షరింగు కేడర్లు పేరు తొ మార్పించి , ఆర్ధిక లబ్ధిని చేకూర్చాడు కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా.
🔺టెలికం డిపార్ట్ మెంట్ ను BJP ప్రభుత్వం BSNL కార్పొరేషన్ గా మార్చే సమయం లొ విజ్ఞతతొ , దూరదృష్టిని ప్రదర్శించి ఆనాడు ఉన్న PTE , CM, TSM అందరిని లక్షా 36 వేల మందిని రెగ్యులర్ చెయించటమే కాకుండా , విలీన ఉద్యొగులందరికి ఏ పబ్లిక్ సెక్టార్ లొ లేని ” ప్రభుత్వ ఫించ్హను ” మరియు ఉద్యొగ భద్రతను ఏర్పాటు చెయించిన పుణ్యాత్ముడు.
🔺ఆ మహానాయకుని 101 వ జయంతిని ఘనంగా నిర్వహించి , BSNL ఉన్నంత వరకు కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా మనందరి మనస్సులలొ జీవించే ఉన్నాడని తెలియచేద్దాం.
అభినందనతో–
కె. అంజయ్య. సర్కిల్ కార్యదర్శి.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷