Dt 19-5-2023:: తిరుపతి జిల్లా మహాసభ అంబేద్కర్ భవనం తిరుపతిలొ జరిగింది.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷డియర్ కామ్రేడ్స్ ,
తేది 19-05-2023 న చిత్తూరు జిళ్లా NFTE BSNL మహాసభ తిరుపతి లోని అంబేత్కర్ భవనం లొ కామ్రేడ్ ఆర్ . రఘుపతి జిళ్లా అద్యక్షుడి అధ్యక్షతన జరిగినది. సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్ కె. అంజయ్య మహాసభలొ పాల్గొని ప్రస్తుతం BSNL పరిస్థితి , ఉద్యోగులు పెండింగు సమస్యల ఎడల మేనేజ్మెంట్ వైఖరి , 4G సర్వీసులు మొదలు పెట్తటం లొ ఆలస్యం , తదితర అంశాలతో పాటుగా , ప్రస్తుతం యూనియన్ ఆర్గనైజేషన్ బలోపేతం లొ నాయకత్వాలు అనుసరించాల్సిన విధానాలు , వాటి అవసరతను గురించి వివరించారు. ఇంకా మహాసభలొ AITUC తిరుపతి జిళ్లా కార్యదర్శి కామ్రేడ్ రాధాకృష్ణ , పెన్షనర్స్ అసోషియేషన్ జిళ్లా కార్యదర్శి. కా / సౌందరాజన్ , సీనియర్ కామ్రేడ్ కె గోవిందస్వామి , సర్కిల్ కార్యవర్గ సభ్యులు కా / కె సి యోగానంద మరియు యస్ . మల్లికార్జున , నెల్లూరు జిళ్లాకార్యదర్శి పి . జిలానీఖాన్ హాజరై ప్రసంగించారు.
నూతన కార్యవర్గ ఎన్నిక విశయంలొ రెండు పానెల్స్ వచ్హి , కొంత చర్చ జరిగిన మీదట సర్కిల్ కార్యదర్శి సలహా మేరకు ఒక అంగీకారం కుదిరిన మీదట , ఏకగ్రివ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. అందుకు సహకరించిన సీనియర్ కామ్రేడ్స్ కు , సభ్యులుకు సర్కిల్ యూనియన్ కృతజ్ఞతలు మరియు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియచెస్తుంది.
కామ్రేడ్ బి. గురప్ప Retd. TT తిరుపతి జిళ్లా అద్యక్షునిగాను , కామ్రేడ్ యస్ . ధనుంజయుడు TT తిరుపతి జిళ్లా కార్యదర్శి గాను మరియు కుమరేషన్ TT తిరుపతి కోశాధికారిగాను , ఇంకా 12 మందిని ఇద్దరు మహిళా సభ్యులు తో పాటుగా కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *