Dt. 27-05-2023:: సర్కిల్ మేనెజ్మెంట్ తో NFTE సర్కిల్ యూనియన్ కలిసిన సందర్భంగా తెలియచేసిన అంశాలు !

డియర్ కామ్రేడ్స్,
మన సర్కిల్ యూనియన్ తో CGM – సురేష్ కృష్ణ గారు మాట్లాడుతూ మన ఏ.పి సర్కిల్ ప్రాఫిట్ పోయిన సం// 900కోట్లుతో పోలిస్తే ఈ 2022-23 సం// కొంత తగ్గింది. అయినను మన సంస్థ ఆపరేషన్ల్ ప్రాఫిట్ కొంత పెరిగింది. వచ్చే సం//కు గాను మన సర్కిల్ 1250కోట్లు రెవెన్యూ ను టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలియజేశారు. మొబైల్ రంగంలో మన మార్కెట్ షేర్ 10% నుండి 5%కు తగ్గింది అని, ఈ సం// అక్టోబర్-నంవబర్ కు ప్రతి టవర్ ను 4G గా మార్చటం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు. మనం కోల్పోయిన 5% శాతం కస్టమర్లను తిరిగి వచ్చే విధంగా ఎంప్లాయిస్ అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి నెలా సరాసరి, ఒకో CSC నుంచి 5000సిమ్స్ అమ్మకాలను 10000సిమ్స్ పెంచాలని అభ్యర్థించారు. ఈ నెల FTTH కనెక్షన్లు భారీ ఎత్తున డిస్కషన్ కు వచ్చాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. TIP ఆపరేటర్లు బాధ్యతగా లేకపోతే మన సంస్థే ప్రతి ఎక్సేంజ్ లో OLTEను ఇన్స్టాల్ చేస్తుంది అని తెలిపారు. అవసరం అయితే 5000 OLTEs ఇన్స్టాల్ చేయటానికి సర్కిల్ మేనేజ్మెంట్ సిద్ధంగా ఉందని తెలిపారు.
మన సర్కిల్ యూనియన్ తో Sr.GM (HR) – సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ TT,JE,JTO కేడర్ లో ఉన్న ఖాళీలను తెలియజేశారు. 2025-26 సం// కు మన సంస్థ పూర్తి ఆర్ధికంగా నిలవాలి అని ప్రభుత్వం నిర్దేశించింది అని తెలిపారు. అందుకు గాను ప్రతి ఒక్క ఉద్యోగి కష్టపడి పని చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
మన సర్కిల్ యూనియన్ తో GM (EB) – వెంకటప్రసాద్ గారు మాట్లాడుతు మన సర్కిల్ లో ఉన్న 4422 టవర్లను 4G కు అనుసంధానం చేస్తున్నాం అని, ప్రతి ఒక్క టవర్ ను 4G+2G టవర్ గా మార్చటం జరుగుతుంది అని, 3G కు వాడిని బ్యాండ్ విడ్త్ ను కూడా 4G కు కేటాయింపు చేస్తామని తెలిపారు. మన సర్కిల్ కు 4G శ్యచురేషన్ ప్రాజెక్ట్ కింద 1900 4G టవర్లను కేటాయించటం జరిగింది. ఈ 1900 టవర్లకు సంబంధించిన పూర్తి ఖర్చు 10సం// వరకు కేంద్రమే భరిస్తుంది అని తెలియజేశారు.
కె.అంజయ్య
సర్కిల్ కార్యదర్శి, ఎన్ ఎఫ్ టీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *