MAy Day జయప్రదం చేయండి

🔺138 మే డే ను జయప్రదం చేయండి🔺
—————————————
డియర్ కామ్రేడ్స్ ,
మే డే కార్యక్రమాన్ని అన్ని జిళ్లా కేంద్రాలలో మే 1 న NFTE జెడాను ఆవిష్కరిస్తూ , జిళ్లా కేంద్రం లొ ఉన్న అందరు సభ్యులును , మహిళా సభ్యులుతొ సహా సమీకరించి నిర్వహించాల్సిందిగా కోరుచున్నాము. ఈ సంవత్సం జూన్ నెల 16 నుండి జులై 15 వరకు నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్నందున , ఈ మే డే కార్యక్రమాన్ని క్రియాశీలక కార్యకర్తలు మరియు నాయకులు ఎఫెక్టివ్ గా జరపాలి. నూతన సభ్యత్వ నమోదు సమయం లొ ఉన్న సభ్యత్వాలను స్థిర పర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని జిళ్లాలలో JE కేడర్లొ ఉన్న సభ్యులు JTO గా ప్రమోషన్ పొంది ఉన్నారు మరియు కొంతమంది సీనియర్లు రిటైర్ అవుతున్నారు. కావున సభ్యత్వం తగ్గి పోతుంది. మహిళా ఉద్యోగుల కొ ఆర్డినేట్ కమిటి సభ్యుల సహకారాన్ని నూతన సభ్యత్వ నమోదు లొ తీసుకోవాల్సిం దిగా కోరుతున్నాము. ఇది ఎంతైనా అవసరం ఉన్నది.
మేడే ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మే నెల 1 వ తేదీన కార్మిక పోరాటాలు , త్యాగాలు , ఐక్యతకు చిహ్నంగా కార్మిక సంఘాలు జరుపుకొనే ప్రపంచ కార్మిక దినం ఈ మే డే . కార్మికుల హక్కుల కొరకు , 8 గంటల పనిదినాల కొరకు అమెరికా లో ఉన్న చికాగో నగరం లోని “హే ” మార్కెట్ ప్రాంతం లొ 1886 మే 4 వ తేదీన శాంతియుతంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ప్రదర్శనపై పాశవిశకంగా జరిపిన పోలీసు కాల్పులలొ 6 గురు కార్మికులు చనిపొవటం ,వందల మంది కార్మికులు గాయాలు పాలు కావటం జరిగింది. వారి త్యాగాలకు గుర్తుగా , వారి రక్తం తొ తడిసిన ఆ గుడ్ద ను ఎర్ర జెండాగా మల్చుకొని మేడే జెండా గా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అప్పటి నుండి మే 1 వ తేదీని కార్మిక సంఘాలు కార్మిక దినంగా పాటిస్తూ మే డే ను జరుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని మన దేశం లొ ఒక్క BMS యూనియన్ తప్ప అన్ని సంఘాలు మే 1 న జరుపుకుంటున్నాయి. మన NFTE కూడ ఆనవాతీగా ఈ పర్వదినాన్ని మన యూనియన్ జెండాను ఆవిష్కరిస్తూ జరుపుకుంటున్నది. ఈ 138 వ మేడే ను అన్ని కేద్రాలలొ మహిళా కోఆర్డినేటర్ల తో జెండాను ఎగరవేయటం గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది.
మే డే—— వర్ద్ధిల్లాలి
కార్మిక ఐక్యత—వర్ధిల్లాలి.
NFTE —-జిందాబాద్
కె. అంజయ్య , సర్కిల్ కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *