NFTE ఒక యూనియన్ కాదు – అదొక వ్యవస్థ – 68 సవత్సరాల చరిత్ర – అందుకే ఓటేసి గెలిపిద్దాం …..బాలెట్ s No 13


డియర్ కామ్రేడ్స్ ,
1954 Nov 24 కు ముందు రోజుల్లొ బ్రిటిష్ వారి పాలన లొ వివిధ రకాలుగా కార్మిక లోకం మొత్తం క్లబ్బులు ,కూటములు , పేరిట ఎవరికి వారే అన్నట్లు గా కార్మికులను కూడదీసుకుంటూ ఉండె పరిస్థితి గా ఉండెది. వాటన్నిటిని ఏకం చేసి ఒకే సంఘం గా ఏర్పాటు చేసిన క్రమం లో నే టెలిగ్రాఫ్ లోని T-III, T-IV యూనియన్లు ,పోష్టల్ లో ని E-III , E-IV యూనియన్లు ,టెలికం లోని E-III , E-IV యూనియన్లు , RMS లోని R-III, R-IV యూనియన్లు ,మరియు అడ్మిన్ష్ట్రేటివ్ యూనియన్ , ఈ తొమ్మిది యూనియన్లును కలుపుకొని “తొమ్మిది చేతులు గల ” గుర్తు ను యూనియన్ కు జెండా గా NFPTE 1954 Nov 24 న ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఐక్యతా చిహ్నం. అదే BSNL కార్పొరేషన్ అయినతరువాత ఒక ట్రెడిష్ న్ ఆర్గనైజేషన్ గా NFTE గాను అదే గుర్తు తో రిజిష్టరు కాబడింది. అప్పటి నుండి తన పూర్వీకుల ఆశయాలకు అనుగుణం గా , ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ , సంస్థ అస్థిత్వాన్ని నిలబెట్టటానికి కృషి చేస్తుంది. మొదటి సారి గుర్తింపు యూనియన్ గా ఉద్యోగులు ఎన్నుకొనగా , నూతనంగా ఏర్పడిన BSNL సంస్థలొ ని ఆ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆలొచించి , అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయటం జరిగింది.
కాని రెండవ సారి గుర్తింపు ఎన్నికలలొ BSNLEU అన్ని యూనియన్లను మోసపూరితంగా కలుపుకొని, FNTO యూనియన్ ఎన్నికల గుర్తు తో పోటి చేసి సింగల్ యూనియన్ గా గుర్తింపు పొందింది. ఆ మొదటి రోజు నుండే ఉద్యొగులకు NFTE ఏర్పాటు చేసిన ప్రయోజనా లు కు తూట్లు పొడవటం మొదలు పెట్తటం జరిగింది. అన్ని ప్రయోజనాలను తుడిచి పెట్టి పోతున్నా , సంస్థ అస్థిత్వం నాశనానికి గురవుతున్నా BSNLEU ప్రేక్షక పాత్రతో ఉద్యోగులకు ద్రోహం తలపెట్టింది. అది ఈ నాటికి వేతన సవరణ ఆరు సంవత్సరాలు లేకుండా ఉండటమే కాకుండా , జీతాలు కూడా సకాలంలో చెల్లించకుండా , వి ఆర్ యస్ లొ ఉద్యోగులు వెళ్ళేలా చేయటం జరిగింది. అలాంటి BSNLEU ను ఈ ఎన్నికలలొ ఓడించి , రెండొ యూనియన్ గా ను NFTE ని మొదటి యూనియన్ గా ఎన్నుకోవటానికి ఉద్యోగులు నిర్ణయించు కున్నారు.
ఇక యన్ .యఫ్ .టి .యి నాయకులు , కార్యకర్తలు SEWA BSNL మిత్రులు సహకారం తో ఎంప్లాయీస్ యూనియన్ జిమ్మిక్ లు సాగకుండా ,పోల్ మేనేజ్మెంట్ చెసుకొవాల్సి ఉన్నది.
VOTE for NFTE BSNL ballot S.N0 13.
k Anjaiah. CS AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *