NFTE కర్నూల్ జిళ్లా ఎన్నికల సభ విజయవంతం 🌺

గెలుపు ఉత్సాహం తో కర్నూలు జిళ్లా ఎన్నికల సభ టెలిఫొన్ ఎక్షేంజి ఆవరణ లొ జరిగింది. సభకు జిళ్లా అధ్యక్షులు కామ్రేడ్ J V RAMANA అధ్యక్షత వహించగా, జిళ్లా కార్యదర్శి కామ్రేడ్ K Adinarayana వేదిక పైకి ఆహ్వానితులైన సర్కిల్ కార్యదర్శి కె అంజయ్య, సర్కిల్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ కె వి యతీంద్రనాధ్, కర్నూలు జిళ్లా సేవా బి యస్ యన్ యల్ అధ్యక్ష, కార్యదర్శులైన బ్రదర్ కళ్యాణ్ & భీం రాజు గార్లను, సర్కిల్ కార్యవర్గ సభ్యులైన కామ్రేడ్ జక్రయ్య, మురళి కృష్ణ లను ఆహ్వానించగా, సభను ప్రార్ధన తొ కాం / రమణ ప్రారంభించారు.
కామ్రేడ్ యతీంద్రనాధ్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ యూనియన్ అబద్దాల ప్రచారాలను గురించి మరియు వేతన సవరణ చర్చల విషయం లో ఎంప్లాయీస్ యూనియన్ తిరోగమన ప్రతిపాదనల గురించి, ఇంకా డైరెక్ట్ జె ఇ కేడరు సమస్యల ఎడల NFTE తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ద గురించి వివరించటం జరిగింది.
సేవా బి యస్ యన్ యల్ జిళ్లా కార్య దర్శి భీం రాజు మరియు అద్యక్షులు కళ్యాణ్ ఇద్దరు తమ సేవా సభ్యులు అందరికి NFTE కి వెరిఫికేషన్ లొ మద్దతు నిచ్హి ఓటు చేయించే విధం గా చర్యలు తీసుకుంటామని, 24 వ తేది జరిగే జనరల్ బాడి సమావేశం లొ సర్కిల్ కార్యదర్శి సమక్షం లొ తీర్మానం చెస్తామని తెలియచేసారు. సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్ కె అంజయ్య ఈ ఎనికలలొ NFTE గెలుపు ఉద్యొగులకు, సంస్థకు ఎంత అవసరమో వివరిస్తూ BSNLEU ఫైల్యుర్స్ ను గురించి వివరించటం జరిగింది. కర్నూల్ జిళ్లా నుండి JTO గా సెలక్ట్ అయిన మన సభ్యుడు కామ్రేడ్ తిరుమలేషు ను అభినందించింటం జరిగింది. ఈ సమావేశానికి 53 మంది సభ్యులుకు గాను 42 మంది మహిళా సభ్యులు తొ సహా ఉత్సాహంగాహాజరైనారు. మీటింగు కు ముందుగా జి యం టి డి ఆఫీసు, ఎక్షేంజి లలొ పనిచేస్తున్న ఉద్యొగులను సర్కిల్ కార్యదర్శి కల్సి NFTE కి సీరియల్ నంబరు 13 కు ఓటు వేయాలని కోరటం జరిగింది కామ్రేడ్ కె ఆదినారాయణ వందన సమర్పన తో సమావేశం ముగిసింది. 🌹

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *