డియర్ కామ్రేడ్స్,
తేదీ 15-09-2022 తిరుపతి లో కా// బి.గురప్ప జిల్లా కార్యదర్శి నాయకత్వం లో కా// ఆర్ రఘుపతి జిల్లా అద్యక్షులు , ఆలిండియా ఉపాద్యక్షులు వారి అద్యక్షతన ఎన్నికల సభ ఏర్పాటు జరిగింది. అందులొ సర్కిల్ కార్యదర్శి కా// అంజయ్య , సర్కిల్ సహాయ కారదర్శి కా//కె వి యతీంద్రనాధ్ మరియు సేవా BSNL జిల్లా కార్యదర్శి రామ మూర్తి , సేవా అద్యక్షులు చిన్నప్పయ్య తదితరులు హాజరై NFTE S.No.13 కు ఓటు వేసి గెలిపించాల్సిన అవసరతను గురించి ప్రసంగించారు. 50 మందికి పైగా సభ్యులు హాజరైన సమావేశం లొ సేవా కార్యదర్శి బ్రదర్ రామ మూర్తి మాట్లాడుతూ చిత్త శుద్ది తో క్రియాశీలకంగా సెవా సభ్యులు అందరు 12-10-2022 జరిగే వెరిఫికేషన్ లొ NFTE S.No.13 కి ఓటు వేసి జిల్లా లొ గెలుపుకు తోడ్పాటు చెస్తామని హామీ ఇచ్హారు. సమావేశానికి ముందుగా GMTD ఆఫీసు లొని ఉద్యోగులందరిని సర్కిల్ కార్యదర్శి తో పాటుగా కలిసి NFTE S NO 13 కి ఓటు వేయాలని అభ్యర్థించటం జరిగింది. కా// బి.గుర్రప్ప వందన సమర్పణ తో సమా వేశం ముగిసింది.
NFTE గెలవాలి BSNL నిలవాలి – భవిష్యత్తుకు భరోసా పొందుదాం అనే నినాదాలతొ సభ్యులు నినదించటం జరిగింది.
– సర్కిల్ కార్యదర్శి,
ఎన్ ఎఫ్ టీ ఈ, ఏ.పి