NFTE గెలవాలి – BSNL నిలవాలి – భవిష్యత్తు కు భరోసా ఉండాలి.

NFTE గెలవాలి – BSNL – నిలవాలి – భవిష్యత్తు కు భరోసా ఉండాలి. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
——————————————
కామ్రేడ్స్,
” అందరు బాగుండాలి – అందులో నేనుండాలి”
ఇది ఉత్తముల మాట —-
కాని BSNLEU నాయకుల తీరు అందుకు విరుద్దంగా ఉంది.
1- ఖమ్మ జిళ్లా కొత్తగూడెం లొ ఒక ఉద్యోగి పక్ష వాతం వచ్హి , అధికారి దయ తో ఆఫీసు లొ పగలు వాచ్ మెన్ గా పని చేస్తుండగా , కామ్రేడ్ సంపత రావు ఆ ఊరులొ ఎన్నికల ప్రచారం లొ పాల్గొంటూ , ఆ పక్షవాతం వచ్హిన ఉద్యోగిని FR 56J ద్యారా ఇంటికి పంపాలని బెదిరిస్తూ మాట్లాడటం వారి మానవత్వ తీరు ను తెలియ చేసింది.

  1. BSNLEU జనరల్ సెక్రటరి కా / అభిమన్యు పంజాబ్ సర్కిల్ నందు జరుగుతున్న ఒక సమావేశం లొ తనను ప్రశ్నించిన ఒక Dr JE తో “బహిరంగ మార్కెట్ లొ ఇంజినీర్లు 10-15 వేల జీతానికి దొరుకుతున్నారు. నీవు 50 వేలు జీతం తీసుకుంటు , ఇంకా ఏదో కావాలని మాట్లాడుతున్నావు ? “అని గద్దించటం జరిగింది.
  2. NEPP ప్రమోషన్ల కు SC/ST రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పి , రిజర్వేషన్లు లేని ప్రమోషన్లుకు BSNLEU అగ్రిమెంట్ అయ్యింది.
  3. DPE నిబంధన ప్రకారం గా , కనీసం 5 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ జరగాల్సిన దాన్ని 0% ఫిట్మెంట్ ను BSNLEU ప్రదిపాదించిఉద్యోగులకు అన్యాయం చేయాలని చూసింది.
    అదే ఫ్రెండ్లీ యూనియన్ NFTE కి ఉద్యోగుల సమస్యల పట్ల ఉన్న నిబద్దతను ఒక సారి గమనిద్దాం .💐
    1- గంట , రెండు గంటలు పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులను BSNL ఏర్పాటు సమయం లో లక్షకు పైగా రెగ్యులర్ చేయించటమే కాకుండా , వారికి పై కేడరుకు ప్రమోషన్ కు కూడ NFTE అవకాశం కల్పించింది.
  4. OTBP/ BCR ప్రమోషన్ల లో SC/ST ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించి వారి కి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం జరిగింది.
  5. DPE నిబంధనల ప్రకారంగా వేతన సవరణ లొ 5% ఫిట్మెంట్ ను డిమాండ్ చేయటం ద్యారా ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని అడ్డుకోవటం జరిగింది.
    కావున నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులందరు తేది 12-10-2022 న జరిగేఎన్నికలలొ “ఫ్రెండ్లీ యూనియన్ ” అయిన NFTE BSNL – S NO 13 గుర్తు పై ఓటు వేసి మొదటి యూనియన్ గా ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
    భవదీయులు
    M ప్రసాదు బాబు. సర్కిల్ కార్యదర్శి , సెవా బి.యస్ .యన్ .యల్
    K . అంజయ్య , సర్కిల్ కార్యదర్శి
    యన్ యఫ్ టి యి
    జై భీం. జై NFTE BSNL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *