ఉత్తర ప్రదేష్ -లక్నో లొ 3-4 Nov /2023 రెండు రోజులు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలొ ఈ క్రింది ముఖ్యమైన డిమాండు వేతన సవరణ పై తీర్మానాలు ఆమొదించటమైనది.
1-)3 వ వేతన సవరణ గురించి.
BSNL ను ప్రభుత్వం వ్యూహాత్మక కంపెనీ గా పార్లమెంటు లొ ప్రకటించటం జరిగింది. NTP అమలు లొ భాగం గా ప్రభుత్వం లాభాలు రాని గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాలకు BSNL ద్యారా సర్వీసులును అందించటం జరుగుతుంది. మిలటరి / రక్షణ రంగం లొ BSNL సర్విసులును వినియోగించటం జరుగుతుంది. కావున లాభాలు / ఎఫోర్డబిలిటి క్లాజును ఉద్యోగుల వేతన సవరణ కు వర్తింపచేయటం తగదని , ఉద్యోగులు 16 సంవత్సరాలుగా వేతన పెంపుదల లేకుండా , వేతన స్థంభనకు గురై ఉన్నారు కావున వెంటనె వేతన సవరణ జరపాలని తీర్మానించటం జరిగింది.
ఈ లొగా జాయింట్ ఫోరం నాయకులు IDA 200% దాటినందున దాన్ని బేసిక్ లొ విలినం చేస్తు అన్ని బెనిఫిట్స్ కు వర్తించే విధంగా డియర్నెస్ డి ఏ గా పరిగణించె చర్యలు తీసుకొవాలని కార్యవర్గం తీర్మానించింది.