*NFTE BSNL ఆలిండియా మహాసభల (రాంచి ) తీర్మానాలు – ఉద్యోగుల ముఖ్య సమస్యల ఎడల నిబద్దతకు నిదర్శనం *
డియర్ కామ్రేడ్స్ ,
ఆలిండియా మహా సభలు జార్ఖండ్ రాష్ట్రం “రాంచి “నందు తేది 27-30 ఆగష్టు.లొ జరిగినవి. ఆ మహాసభలలో ఈ క్రింది ముఖ్య తీర్మానాలను తీసుకోవటం జరిగింది. అవి యన్ యఫ్ టి యి ఉద్యోగులు ఎడల ఉన్న నిబద్దత ను తెలియపర్చుతున్నాయి.
✅ ఒక కంపెని – ఒకే పెన్షన్ విధానం
ప్రస్తుతం BSNL కంపెనీ లొ దాదాపు గా 16,000 మంది అందులొ 14,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు BSNL ఏర్పడిన తరువాత రిక్రూట్ అయ్యి పని చేస్తూ ఉన్నారు .మిగతా 16000 వేల మంది ఉద్యోగులు DOT /DTS నుండి BSNL లోనికి విలీనం అయినవారు.
అందరు కు కూడ ఒకే రకమైన డ్యూటీ ,ఒకే విధమైన వేతనాలు , ఒకె విధమైన విధి విధానాలు అమలులో ఉన్నాయి. సుప్రిం కొర్ట్ తీర్పు ప్రకారం గా ఒకే పని కి ఒకే వేతనం* అమలు జరుగుతుంది మన సంస్థలొ కూడ .
ప్రధాన మంత్రి గారు డిఫెన్స్ లొ ఆ ఉద్యోగులకు “ONE RANK – ONE PENSION” విధానాన్ని అంగీకరించటం జరిగింది.
ఒకే పని చేస్తూ – ఒకే జితం అమలు లొ ఉన్న సంస్థలొ , పెన్షన్ అమలు లొ కొందరికి ప్రభుత్వ పించ్హను , మరి కొందరికి పించ్హను లేకుండా EPF ఈ వ్యత్యాసం ఎందుకు కొనసాగాలి . అందుకే NFTE యూనియన్ ఆలోచించి ” ఒకే సంస్థ – ఒకే పెన్షన్ ” విధానం డిమాండ్ తో ఆలిండియా మహాసభలలొ తీర్మానం చేసి మేనేజ్ మెంటు కు సమర్పించింది. ఇది డైఎక్ట్ ఉద్యోగులు మొత్తానికి పెద్ద ఊరటనిచ్హే అంశం.
✅ మెడికల్ పాలసీ బెనిఫిట్స్
ఇపుడు అమలు లొ ఉన్న MRS స్కీము ను మేనేజ్ మెంట్ బిల్లులును సక్రమంగా చెల్లించకుండా నిర్వీర్యం చేసింది. కార్పోరేట్ ఆసుపత్రులు ఏవీ కూడ BSNL ఉద్యోగులకు BSNL MRS క్రింద ట్రీట్ మెంట్ ఇవ్వటానికి ముందుకు రాని పరిస్థితి. mRS స్కీము సక్రమంగా అమలు చేయించాల్సిన మొదటి యూనియన్ EU , గ్రూఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము తామె తెచ్హామని నిసిగ్గుగా చెప్పుకుంటుంది. ఆ స్కీము ప్రకారంగా ఉద్యోగి తన జేబు నుండి కొంత మొత్తాలను భరించాల్సి ఉంది.
ఉద్యొగుల ఆరోగ్య పరిస్థిని పరిరక్షించాల్సింది సంస్థ మాత్రమే ! కాని ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం హెల్త్ స్కేము తామె చేచ్హా మని భీరాలుకు పోతుంది.
NFTE ఆలిండియా మహాసభలలొ హెల్త్ స్కీము పాలసి ప్రీమియం చెల్లింపు భాద్యత BSNL మేనేజ్ మెంట్ తీసుకోవాలని తీర్మానం చేసి మేనెజ్ మెంట్ కు డిమాండ్ గా ఇవ్వటం జరిగింది.
✅ నూతన ప్రమోషన్ పాలసీ ఏర్పాటు
ఎంప్లాయీస్ యూనియన్ తెచ్హిన NEPP ప్రమోషన్ పాలసీ వ్యత్యాసాలతో కూడుకొనటమే కాకుండా , ఎగ్జిక్యూటివ్ లకు ప్రయోజన కరంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ ఉండగా , నాన్ ఎగ్జిక్యూటివ్ లకు మాత్రం రెండు రకాలుగా 4,7,8,8- 8-8-8-8 గా అగ్రిమెంట్ అయ్యి మరియు Sc/St ఎంప్లాయీస్ కు రిజర్వేషన్లు లేకుండా ను ఉద్యోగులకు అన్యాయం చేయటం జరిగింది.
ఈ అన్యాయాలను తొలగించే విధంగా NFTE ఆలిండియా మహాసభలలొ *ఎలాంటి వ్యత్యాసాలు లేని ప్రమోషన్ పాలసి SC/ST ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కు ,ప్రమోషన్ ల లొ రిజర్వేషన్ ఉండె విధమైన ప్రమోషన్ పాలసీ ని ఏరాటు చేయాలని కూడ తీర్మానం చేయటం జరిగింది *
పై మూడు ముఖ్య మైన సమస్యలును Nfte BSNL తీసుకోవటంతో ముఖ్యం గా సెవా & డైరెక్ట్ యంగ్ కామ్రేడ్స్ ఈ ఎన్నికలలొ బాలెట్ లొ S No 13 NFTE కి ఓటు వేయాలని నిశ్చయించుకున్నారు . అదే BSNLEU ఫ్రష్టేషన్ కు కారణం అయ్యి , NFTE పై అవాస్తవాలు తొ కూడిన చౌక బారు ప్రచారానికి ఒడిగట్తింది
- NFTE BSNL కు బాలెట్ లొ సీరియల్ నంబరు 13 కే ఓటేద్దాం – ప్రధమ యూనియన్ గా గెలిపిదాం*
NFTE గెలవాలి – BSNL నిలవాలి
భవిష్యత్తుకు భరోషా ఉండాలి.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి