పీర్ల పండుగ : మొహరం పండుగును తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. షియా తెగ వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవప్రవక్త ముహమ్మదుగారి మనమళ్ళు హసన్, హుసేన్ ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పీరుల్ని ఊరేగిస్తారు. రక్తంకారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు.
ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి.
August 9, 2022