డియర్ సేవా బి యస్ యన్ యల్ జిల్లా , బ్రాంచి కార్యదర్శులకు – SEWA BSNL సర్కిల్ యూనియన్ AP సర్కిల్ పిలుపు 🙏🏿
జై భీం – జై బుద్దహ్
కామ్రేడ్స్ ,
మన BSNL సంస్థలో తేది 12-10-2022 న 9వ సభ్యత్వ వెరిఫికేషన్ జరుగుతున్న విషయం అందరికి తెలిసినదే ! ఈ ఎన్నికలలో ట్రెడిషనల్ గా స్నేహపూర్వకంగా SEWA తో పూర్వం నుండి ఉంటున్న NFTE BSNL జనరల్ సెక్రటరి కామ్రేడ్ చందేశ్వర్ సింగ్ గారు మన జనరల్ సెక్రటరి బ్రదర్ ND RAM గారిని కలిసి NFTE BSNL కు మద్దతును కోరిన మీదట మన ఆలిండియా నాయకత్వం 9వ సభ్యత్వ వెరిఫికేషన్ లొ NFTE BSNL కు SEWA BSNL మొత్తం ఓట్లను వేసి గెలిపించాలని నిర్ణయించి పిలుపు నివ్వడం జరిగింది.
తేది 14-9-2022 న NFTE CS కామ్రేడ్ అంజయ్య ,సర్కిల్ అద్యక్షులు కామ్రేడ్ చంద్రశేఖరరావు మరియు సహాయ కార్యదర్శి ఎ.నాగెంద్రబాబు తదితరులు SEWA BSNL సర్కిల్ అధ్యక్ష , కార్యదర్శులును కలిసి AP సర్కిల్ నందు తమ యూనియన్ కు మద్దతు కోరి , మన సభ్యులు మొత్తం ఓట్లను ఈ ఎన్నికలలొ బాలెట్ లొని సీరియల్ నెంబరు 13 NFTE గుర్తు కు వేసి సహకరించాల్సిందిగా కోరి ఉన్నారు.
కావున SEWA BSNL జిల్లా , బ్రాంచి కార్యదర్శులు అందరు మీ మీ జిల్లా లొని మన సభ్యులు అందరిచేత S NO 13 NFTE BSNL కు తెది 12-10-2022 న జరిగే సభ్యత్వ వెరిఫికేషన్ లో ఓటు వేయించి , డా: బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల వారసులుగా నిరూపించుకుందాం అని సర్కిల్ యూనియన్ విజ్ఞప్తి చేస్తుంది.
జై భీం 🙏🏿 జై బుద్దహ్
ఇట్లు:
M Prasad Babu, CS-SEWA
N KoteswaraRao,circle president-SEWA,
R MaheswarRao, chief Advisor, AP circle