*🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺DOT ALTTCని స్వాధీనం చేసుకోవడం కోసం జారీ చేసిన ఆర్డర్‌ను వెంటనే రద్దు చేయాలని 14 -11-2023 న ఆన్లైన్ ద్యారా జరిగిన AUAB సమావేశం డిమాండ్ చేసింది.
ALTTCని DoT స్వాధీనం చేసుకోవాలని జారీ చేసిన ప్రిసిడెన్షియల్ ఆర్డర్ విషయం గురించి చర్చించడానికి BSNL యొక్క ఆల్ యూనియన్‌లు మరియు అసోసియేషన్‌ల (AUAB) సమావేశం తేది 14.11.2023 ఆన్‌లైన్‌లో జరిగింది. AUAB చైర్మన్ కా.చండేశ్వర్ సింగ్ సమావేశానికి అధ్యక్షత వహించి, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు. AUAB కన్వీనర్ కా.పి.అభిమన్యు ఎజెండాను క్లుప్తంగా వివరించారు. కా.ఎం.ఎస్. అదాసుల్, GS, SNEA, కా.N.D. రామ్, GS, SEWA BSNL, కా. V. షాజీ, GS, AIBSNLEA, కా.సురేష్ కుమార్, GS, SNATTA, కా. అనిల్ కుమార్, GS, BSNL ATM, కా.J. విజయకుమార్, GS, TEPU మరియు కా.రామసుందరం GS, BSNLEC, పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 83 ఎకరాలకు పైగా నున్న భూమి మరియు అధునాతన శిక్షణ కోసం భారీ మౌలిక సదుపాయాలతో ఉన్న ALTTC విలువ సుమారు రూ.6,000 కోట్లు ఉంటుందని నాయకులు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న నాయుకులందరూ ALTTCని ఏకపక్షంగా అక్రమ పద్దతుల ద్వారా DoT స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ALTTC స్వాధీనం కోసం DoT జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టెలికాం కార్యదర్శికి లేఖ రాయాలని సమావేశం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించేందుకు టెలికాం కార్యదర్శితో సమావేశం కావాలని కూడా సమావేశం నిర్ణయించింది. ఇంకా చర్చల ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
*AUAB నాయకులు శ్రీ పి.కె. పూర్వార్, CMD BSNL,ని కలిసి ALTTCని DoT స్వాధీనం చేసుకోవడం గురించి చర్చించారు.*
ఆ తరువాత AUAB, నాయకులు ALTTCని DoT స్వాధీనం చేసుకోవడంపై వారు తమ తీవ్ర నిరసనను CMD కి తెలియజేసారు. BSNL ద్వారా ALTTC నిలుపుదల కోసం BSNL మేనేజ్‌మెంట్ అన్ని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను కంపెనీ మేనేజ్ మెంట్ కిందకు తీసుకురావడానికి మేనేజ్ మెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేనేజ్ మెంట్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ హామీ ఇచ్చారు.
చందేశ్వర్ సింగ్ GS NFTE
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

Leave A Comment

Cart

No products in the cart.

X